Johnson & Johnson: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ

Maharashtra Cancels Johnson Baby Powder Licens Firm Approaches Court - Sakshi

సాక్షి,ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్  బేబీ పౌడర్‌ తయారీ లైసెన్స్‌నురద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసిసినట్టు ఎఫ్‌డీఏ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాన్సన్స్ బేబీ పౌడర్‌ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. (Gold Price: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌)

ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక విలువలకు అనుగుణంగా లేవని రెగ్యులేటరీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే  డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940,  నిబంధనల ప్రకారం జాన్సన్‌ కంపెనీకి ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుండి  జాన్సన్‌ బేబీ పౌడర్‌ స్టాక్‌ను రీకాల్ చేయాలని  కూడా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. (లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి)

ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను అంగీకరించని జాన్సన్ అండ్‌ జాన్సన్ కోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వివరణాత్మక ప్రకటన రావాల్సి ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top