ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్‌ రిఫండ్‌! | Sakshi
Sakshi News home page

ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్‌ రిఫండ్‌!

Published Fri, Feb 16 2024 8:33 PM

Lic Gets Tax Refund Of Rs 21,741 Crore From income tax department - Sakshi

ఫిబ్రవరి 14, 2024న ఆదాయపు పన్ను శాఖ నుంచి సుమారు రూ.21,740 కోట్ల మొత్తాన్ని రిఫండ్‌ పొందినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. 

2012-13, 2013-14, 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఎల్‌ఐసీ రీఫండ్ ఆర్డర్‌లను పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  అయితే ఈ రీఫండ్ మొత్తం విలువ రూ.25,464.46 కోట్లు.

దీనికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నిన్న రూ.21,740.77 కోట్లను విడుదల చేసింది. ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ విభాగం నుంచి మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు  దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement