ఆ బ్యూటిఫుల్‌ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్‌ ఎంతో తెలుసా? | Joseph Radhik man behind Anant Radhika pre wedding photos | Sakshi
Sakshi News home page

ఆ బ్యూటిఫుల్‌ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్‌ ఎంతో తెలుసా?

Published Sat, Jun 15 2024 4:36 PM | Last Updated on Sat, Jun 15 2024 4:57 PM

Joseph Radhik man behind Anant Radhika pre wedding photos

Anant-Radhika pre wedding: ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఈ గ్రాండ్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన అప్‌డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్‌ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్‌ ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.

జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్‌ ఈయనే. ఇంత ఫేమస్‌ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్‌ను ఎంచుకున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్‌ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement