నవంబర్‌లో క్షీణించిన జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు | Jems And Jewellery Exports Declined In November | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో క్షీణించిన జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు

Dec 23 2021 8:59 AM | Updated on Dec 23 2021 9:12 AM

Jems And Jewellery Exports Declined In November - Sakshi

ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నవంబర్‌లో 4.21 శాతం క్షీణించాయి. రూ.17,785 కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఈ రంగానికి సంబంధించిన ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.18,565 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. దిపావళి సమయంలో తయారీ కార్యకలాపాలకు విఘాతం దృష్ట్యా ఎగుమతుల క్షీణత అంచనా వేసిందేనని పేర్కొంది.

‘‘గతేడాదితో పోలిస్తే 2021లో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల పనితీరు అంచనాల కంటే ఎక్కువే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆభరణాల వినియోగ దేశమైన అమెరికా భారత్‌ నుంచి కొనుగోళ్లను పెంచడం సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.65 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని భావిస్తున్నాం’’ అని జీజేఈపీసీ చైర్మన్‌ కొలిన్‌షా తెలిపారు. కట్, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు నవంబర్‌లో 21 శాతం తగ్గి రూ.9,720 కోట్లుగా ఉంటే, బంగారం ఆభరణాల ఎగుమతులు 38 శాతం పెరిగి రూ.5,286 కోట్లకు చేరినట్టు జీజేఈపీసీ తెలిపింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement