breaking news
Jems Jewellery Export Promotion Council
-
నవంబర్‌లో క్షీణించిన జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు
ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నవంబర్‌లో 4.21 శాతం క్షీణించాయి. రూ.17,785 కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఈ రంగానికి సంబంధించిన ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.18,565 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. దిపావళి సమయంలో తయారీ కార్యకలాపాలకు విఘాతం దృష్ట్యా ఎగుమతుల క్షీణత అంచనా వేసిందేనని పేర్కొంది. ‘‘గతేడాదితో పోలిస్తే 2021లో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల పనితీరు అంచనాల కంటే ఎక్కువే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆభరణాల వినియోగ దేశమైన అమెరికా భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.65 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని భావిస్తున్నాం’’ అని జీజేఈపీసీ చైర్మన్ కొలిన్‌షా తెలిపారు. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు నవంబర్‌లో 21 శాతం తగ్గి రూ.9,720 కోట్లుగా ఉంటే, బంగారం ఆభరణాల ఎగుమతులు 38 శాతం పెరిగి రూ.5,286 కోట్లకు చేరినట్టు జీజేఈపీసీ తెలిపింది. -
జీఆర్టీ చైర్మన్ రాజేంద్రన్‌కు పురస్కారం
హైదరాబాద్: జీఆర్టీ జ్యుయల్లర్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ జి.రాజేంద్రన్‌కు జెమ్స్ అండ్స్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. 50 ఏళ్లుగా జ్యుయలరీ రంగానికి చేసిన సేవలకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ అవార్డును రాజేంద్రన్ కుమారుడు, జీఆర్టీ ఎండీ జి.ఆర్. రాధాకృష్ణన్ జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా నుంచి ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు.