వాట్సాప్‌ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడులు | Investing in Funds Through WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడులు

Apr 7 2025 2:18 PM | Updated on Apr 7 2025 3:31 PM

Investing in Funds Through WhatsApp

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమలోనే తొలిసారిగా ట్యాప్‌2ఇన్వెస్ట్‌ ఫీచరును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీనితో కేవైసీ ధృవీకరణ పూర్తి చేసుకున్న ఇన్వెస్టర్లు వాట్సాప్‌ (నంబరు 8270682706) ద్వారా ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ తరహాలోనే ఇది పనిచేస్తుందని తెలిపింది. దీనితో కేవలం ఆయా ఆప్షన్లపై క్లిక్‌ చేయడం ద్వారా తమ స్కీముల్లో ఏకమొత్తంగా లేదా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ల (సిప్‌) రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చని సంస్థ వివరించింది. యూపీఏ ఆటోపే, నెట్‌బ్యాంకింగ్, ఇతరత్రా డిజిటల్‌ చెల్లింపు విధానాలను ఇది సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ ఎండీ నవనీత్‌ మునోట్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement