Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు... | Interim Budget 2024: Finance minister Nirmala Sitharaman performed the traditional Halwa | Sakshi
Sakshi News home page

Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు...

Jan 25 2024 4:29 AM | Updated on Jan 25 2024 4:29 AM

Interim Budget 2024: Finance minister Nirmala Sitharaman performed the traditional Halwa - Sakshi

2024 మధ్యంతర బడ్జెట్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు ప్రతీకాత్మకంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థికశాఖ నార్త్‌బ్లాక్‌లో హల్వా విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బడ్జెట్‌ పత్రాల ముద్రణ అధికారికంగా ప్రారంభమవుతుంది.

లోక్‌సభలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ‘లాక్‌–ఇన్‌’లో ఉంటారు.   బడ్జెట్‌కు ముందు సంప్రదాయంగా వస్తున్న ఈ హల్వా రుచుల ఆస్వాదన కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి కరాద్, ఫైనాన్స్‌ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్, దీపమ్‌ సెక్రటరీ తుహిన్‌ కాంతా పాండే తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement