రూ.76వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వ పథకం, ప్రధాని మోదీతో ఇంటెల్‌ సీఈఓ భేటీ!

Intel Ceo Pat Gelsinger Meets Pm Modi - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ చిప్‌ దిగ్గజం ఇంటెల్‌ సీఈవో ప్యాట్‌ జెల్‌సింగర్‌తో సమావేశం సంతృప్తికరంగా సాగినట్లు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు. 

దేశీయంగా చేపట్టిన సెమీకండక్టర్‌ ప్రోగ్రామ్, మొబిలిటీ, టెక్నాలజీ, ఆటో ఇన్నోవేషన్‌లపై వ్యూహాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. జెల్‌సింగర్‌ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలసినట్లు పీఎంవో పేర్కొంది. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్‌పై చర్చలు జరిగినట్లు తెలియజేసింది. 

కాగా.. జెల్‌సింగర్‌తో సమావేశంలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణా, జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం హాజరైనట్లు రాజీవ్‌ వెల్లడించారు. 

సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీకి మద్దతుగా ప్రభుత్వం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇంటెల్‌ సీఈవో దేశీ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం ద్వారా హైటెక్‌ ప్రొడక్షన్‌కు గ్లోబల్‌ కేంద్రంగా ఆవిర్భవించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. చిప్‌ తయారీ దిగ్గజాలను ఆకట్టుకునే యోచనలో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top