breaking news
Intel businesses
-
రూ.76వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వ పథకం, ప్రధాని మోదీతో ఇంటెల్ సీఈఓ భేటీ!
న్యూఢిల్లీ: గ్లోబల్ చిప్ దిగ్గజం ఇంటెల్ సీఈవో ప్యాట్ జెల్సింగర్తో సమావేశం సంతృప్తికరంగా సాగినట్లు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. దేశీయంగా చేపట్టిన సెమీకండక్టర్ ప్రోగ్రామ్, మొబిలిటీ, టెక్నాలజీ, ఆటో ఇన్నోవేషన్లపై వ్యూహాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. జెల్సింగర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలసినట్లు పీఎంవో పేర్కొంది. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్‌పై చర్చలు జరిగినట్లు తెలియజేసింది. కాగా.. జెల్సింగర్తో సమావేశంలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణా, జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం హాజరైనట్లు రాజీవ్ వెల్లడించారు. సెమీకండక్టర్, డిస్ప్లే తయారీకి మద్దతుగా ప్రభుత్వం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇంటెల్ సీఈవో దేశీ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం ద్వారా హైటెక్ ప్రొడక్షన్‌కు గ్లోబల్ కేంద్రంగా ఆవిర్భవించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. చిప్ తయారీ దిగ్గజాలను ఆకట్టుకునే యోచనలో ఉంది. -
ఇంటెల్ ఉద్యోగులకు భారత్ లో భరోసా
అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ సంస్థ భారత్‌లో ఉద్యోగాల కోత విధించే అవకాశం లేదని ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో, ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగుల కోత భారత్ లో ఉండే చాన్స్ లేదని, ఈ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికే కంపెనీ కృషిచేస్తామని ప్రకటించారు. కంపెనీ అభివృద్ధికి భారత్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఇక్కడ ఉద్యోగుల కోత విధించబోరని ఇంటెల్ సంస్థ కన్సూమర్ టెక్నికల్ మార్కెటింగ్ డైరెక్టర్ థైన్ క్రిట్జ్ తెలిపారు. భారత్ లో రిటైలర్ల వ్యాపారం, అవకాశాలు పెరుగుతున్న క్రమంలో కంపెనీ భారత్ లో పెట్టుబడులే పెడుతుందని చెప్పారు.