ఇన్ఫోసిస్ జాక్‌పాట్‌! రూ. 3,722 కోట్ల భారీ డీల్‌ కైవసం..

Infosys wins 454 million usd deal from Danske Bank - Sakshi

ఇన్ఫోసిస్ జాక్‌పాట్‌ కొట్టేసింది. డెన్మార్క్ దేశానికి చెందిన డాన్స్‌కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డీల్‌ను దక్కించుకుంది. ఇందు కోసం 454 మిలియన్‌ డాలర్ల ( సుమారు రూ. 3,722 కోట్లు) డీల్‌ దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా తెలిపింది.

ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ 900 మిలియన్‌ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, మరో మూడు సంవత్సరాల వరకు పునరుద్ధరించరించే ఆస్కారం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. యూకేకి చెందిన నేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ సేవింగ్స్‌ ట్రస్ట్‌ (NEST) నుంచి 1.1 బిలియన్‌ డాలర్ల  డీల్‌ను టీసీఎస్‌ దక్కించుకున్న కొన్ని రోజులకే ఇన్ఫోసిస్‌కు ఇంత పెద్ద డీల్‌ దక్కడం గమనార్హం. 

తమ మెరుగైన డిజిటల్, క్లౌడ్, డేటా సామర్థ్యాలతో డాన్స్‌కే బ్యాంకు కోర్ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ సహకరిస్తుందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. శక్తివంతమైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డాన్స్‌కే బ్యాంకుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు.

 

యాక్సెంచర్‌పై గెలిచి.. 
పోటీలో ఉన్న యాక్సెంచర్‌ కంపెనీపై గెలిచి డాన్స్‌కే బ్యాంకు డీల్‌ను ఇన్ఫోసిస్ సాధించింది. ఈ డీల్‌లో భాగంగా భారత్‌లోని బెంగళూరులో ఉన్న డాన్స్‌కే బ్యాంక్ ఐటీ కేంద్రం కూడా ఇన్ఫోసిస్‌ నిర్వహణలోకి రానుంది. ఈ కేంద్రంలో సుమారు 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా గత మేలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ‘బీపీ’ నుంచి 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం తెలిసిందే. 2020 సంవత్సరం చివరిలో జరిగిన డైమ్లర్‌ ఒప్పందం తర్వాత ఇదే అతిపెద్ద డీల్‌.

ఇదీ చదవండి: అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top