ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్! | Infosys Announces Up To Rs 8 Lakh Incentive Package, Know Reason Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!

Published Tue, Jun 18 2024 4:56 PM | Last Updated on Tue, Jun 18 2024 6:18 PM

Infosys Announces Up To Rs 8 Lakh Incentive Package

ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిస్ ట్రాన్స్‌ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరమైన హుబ్బల్లిలో తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

హుబ్బల్లిలోని క్యాంపస్‌కు కంపెనీ స్థానిక ఉద్యోగులను రప్పించడానికి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. అందులో ''భవిష్యత్తును నిర్మించడానికి మీలాంటి ప్రతిభ ఉన్నవారి కోసం వేచి ఉందని'' పేర్కొంది.

ఇక ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ విషయానికి వస్తే.. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 25,000 అందిస్తారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలో.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 25000 అందిస్తారు. ఇలా మొత్తం 24 నెలల్లో రూ.1.25 లక్షలు లభిస్తాయి.

లెవెల్ 4 ఉద్యోగులకు కంపెనీ ప్రారంభంలో రూ. 5000 అందిస్తుంది. ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 50000 జమచేస్తుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఈ కేటగిరి ఉద్యోగులు మొత్తం రూ. 2.5 లక్షల బోనస్ పొందవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 1.5 లక్షలు అందిస్తారు. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ. 8 లక్షలు అందిస్తారు.

ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ తీసుకురావడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని విభేదాలే అని తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని రాజకీయ పార్టీలు నుంచి సంస్థ మీద ఒత్తిడి పెరగటం మాత్రమే కాకుండా.. ఇన్ఫోసిస్ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. కంపెనీకి ఉపాధి కల్పన కింద కేటాయించిన 58 ఎకరాల భూమిని కూడా వెన్నక్కి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఈ కారణంగా ముంబై కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను కంపెనీ హుబ్బళ్ళికి తరలించడానికి ఈ ఆఫర్ తీసుకువచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement