ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్‌! | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్‌!

Published Mon, Sep 4 2023 10:25 PM

IndiGo upgrades onboard catering service - Sakshi

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్‌ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది.

ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్‌ ఫుడ్స్‌ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు.

“ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్‌ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్‌లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్‌ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ  కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్‌ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు.

ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్‌లో పడుతుందా?

Advertisement
 
Advertisement
 
Advertisement