రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! వాటిని తినాలంటే జంకుతున్న భారతీయులు..!

Indians Cutting Down on Fried Food Vegetables as Higher Prices Bite - Sakshi

నాన్నకు ప్రేమతో సినిమాలో ‘బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌’ గురించి ఎన్టీఆర్‌ చెబితే మనందరం చూసే ఉంటాం. ఎక్కడో బటర్‌ ఫ్లై రెక్కలు వీదిలిస్తే...అది అమెరికాలో పెను తుఫానుకి కారణమవుతోంది. అచ్చంగా మన పరిస్థితి అలాగే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభిస్తే.. ధరల పేలుడు ప్రభావం మన ఇళ్లలో కనిపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు శాంతిమంత్రం అంటుంటే అనివార్య పరిస్థితుల్లో ఇండియన్లు నిర్భంధ పొదుపు మంత్రం జపించాల్సి వస్తోంది.

ఫ్రైడ్‌ ఫుడ్‌కు దూరం..!  
కోవిడ్‌-19 రాకతో రెండేళ్లపాటు ఆర్థికంగా చిక్కిపోయినా కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అంతా సర్దుకుపోతుందనుకుంటే మళ్లీ రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో పాటుగా క్రూడాయిల్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు సిద్ధమైంది. పెట్రోల్‌, డిజీల్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్రం పెంచేసింది. ఈ చర్యలు నేరుగా సామాన్యుడిపై పడుతున్నాయి. ధరల పెంపుతో పలు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తమ జేబులకు చిల్లు పడకుండా తమ ఖర్చులను తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం తమ ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండేందుకు భారతీయులు సిద్దమయ్యారు. వేయించిన తినుబండారాలకు, పలు కూరగాయల జోలికి పోవడం లేదు. 

చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు

పొదుపు మంత్రం..!
ఖర్చులు పెరగడంతో ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోని భారతీయులు ధరల పెంపు కాటుకు గురవుతున్నారు. చేసేదేమి లేక పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. దాదాపు 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 800 మిలియన్లు మహమ్మారి సమయంలో ప్రధానమైన ఆహార పదార్థాల ప్రభుత్వ సరఫరాలను ఉచితంగా పొందుతూ బతుకు వెళ్లదీస్తున్నారు. పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు చిగురించేలోగా వచ్చిన యుద్ధం దెబ్బతో చిన్న వస్తువుల ధరలు కూడా పెరగాయి. దీంతో సామాన్యుల బడ్జెట్‌ కుదేలవుతోంది. వరుసగా మూడో ఏదాది కూడా సామాన్యుల ఆర్థిక పరిస్థితి పుంజుకునే అవకాశం కనిపించడం లేదని భారతదేశ ప్రధాన గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ హెచ్చరించారు. భారతీయుల్లో పొదుపు మంత్రం కోవిడ్‌-19 వచ్చిన్పటినుంచే మొదలైనా.. ఇప్పుడది నిర్బంధ పొదుగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఫ్యూయల్‌ ఎఫెక్ట్‌
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, దిగుమతిపై ఆధారపడిన దేశాలకు శాపంగా మారాయి. ముఖ్యంగా శాతం ముడిచమురుని దిగుమతి చేసుకునే భారత్‌కి అయితే దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చింది. మూడు నెలలు పూర్తికాకముందే ముడి చమురు ధరలు 50 శాతం పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు రెడీ అయ్యాయి. ఇంధన ధరల బాదుడును మొదలు పెట్టాయి. ముందుగా బల్క్‌ ఫ్యూయల్‌ ధరలు పెరగగా ఇప్పుడు రిటైల్‌ ధరలు కూడా పైకి ఎగబాకడం మొదలెట్టాయి.

చదవండి: చక్కెర ఉత్పత్తిని తగ్గించండి..లేకపోతే భారీ నష్టం

ఎఫ్‌ఎంసీజీ వస్తువుల ధరల పెంపు..!
రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్‌ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి.

చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top