స్టార్‌ కమెడియన్‌ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా? | Indian Stand Up Comedian Kapil Sharma Marriage, Cars Collection, Vanity Van, And Net Worth 2023 Details - Sakshi
Sakshi News home page

Kapil Sharma Net Worth 2023: స్టార్‌ కమెడియన్‌ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?

Published Mon, Oct 2 2023 4:41 PM

Indian stand up comedian Kapil Sharma Net Worth 2023 - Sakshi

Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్  కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్‌ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్‌ శర్మ పలు  బాలీవుడ్‌  మూవీల్లో  కూడా నటుడిగా సత్తా చాటాడు.   ముఖ్యంగా  తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్‌ అయ్యాడు.  దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్‌ శర్మ నెట్‌వర్త్‌, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి.  పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు,  ముంబైలో లగ్జరీ  అపార్ట్‌మెంట్‌ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్‌వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్‌ ఫ్రెండ్‌ గిన్ని చత్రాత్‌ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు.  ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు.  ఇక కపిల్‌ ఆస్తిపాస్తులను గమనిస్తే  మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు.

పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్‌ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్‌ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు.  విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో  లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు.  దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్‌, టెర్రస్‌ గార్డెన్‌, సినిమా థియేటర్‌ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్‌ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా  ఈ ఇంటిని బాగా  అలంకరించడం వారికి అలవాటు.  విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కపిల్‌ శర్మ నెట్‌వర్త్‌
స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత,  నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ  నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది  కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు  చార్జ్‌ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో  గొప్ప మనుసు చాటుకునే టాప్‌ సెలబ్రిటీలలో  ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు.

ఖరీదైన కార్ కలెక్షన్ 
కపిల్ శర్మ , గిన్ని చత్రత్  జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి.  రూ. 1.36  ఖరీదైన Mercedes Benz S350 CDI,  రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్
Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్  లాంటి కార్లున్నాయి.   

DC  డిజైన్‌ చేసిన వానిటీ వ్యాన్
దిలీప్ ఛబ్రియా డిజైన్  చేసిన వానిటీ వ్యాన్  విలువ రూ. 5.5 కోట్లు . బెడ్‌రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్‌ దీని సొంతం. 

Advertisement
 
Advertisement