రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి.. | Indian rupee plummeted to a new all-time low of 84.50 against the US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..

Nov 22 2024 6:19 AM | Updated on Nov 22 2024 8:08 AM

Indian rupee plummeted to a new all-time low of 84.50 against the US dollar

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్‌ ఇండెక్స్‌(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్‌ నిపుణులు తెలిపారు. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్‌ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement