Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు

Indian billionaire Gautam Adani is now world second richest - Sakshi

సాక్షి,ముంబై: భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో పెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇటీవలి ర్యాలీతో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ 155.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే అదానీ సంపద 5.5 బిలియన్లు లేదా దాదాపు 4శాతం పెరిగింది. (బెజోస్‌ మస్క్‌ సరే! అదానీ,అంబానీ సంపద మాట ఏంటి?)

అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని సాధించారు. ఫోర్బ్స్ రియల్ టైం డేటా ప్రకారం 273.5 బిలియన్‌ డాలర్లతో నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న టెస్లా  సీఈవోన్  ఎలాన్‌ మాస్క్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: బెజోస్‌ నుంచి మస్క్‌ దాకా,ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్

కాగా 2022ఏడాదిలో ఇప్పటివరకు అదానీ సంపద 70 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది. ఈ సంవత్సరం తన నికర విలువ పెరిగిన ప్రపంచంలోని టాప్‌-10 సంపన్న వ్యక్తులలో ఒకరు మాత్రమే. ఈ ఏడది ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేశ్‌ అంబానీని అధిగమించారు. ఏప్రిల్‌లో సెంటి బిలియనీర్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ బిల్ గేట్స్‌ను గత నెలలో ప్రపంచంలోని నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత ఆసియాలోనే  గ్లోబల్‌ రిచెస్ట్‌ పర్సన్స్‌ జాబితాలో మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా తన రికార్డును తానే అధిగమించి రెండో  స్థానాన్ని సాధించిన తొలి ఆసియా కుబేరుడిగా నిలిచారు గౌతమ్‌ అదానీ. అంతేకాదు ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఫస్ట్‌ ప్లేస్‌చేరుకోవడం కూడా పెద్దకష్టమేమీ కాదని బిజినెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top