ట్విటర్‌కు షాక్‌: ‘కూ’ దూకుడు, మస్క్‌కు నిద్ర కరువే!

Indian app Koo launching in US the second most widely in the world - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ యాప్ ‘కూ’ సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్ టేకోవర్‌ తరువాత యూజర్లు తగ్గిపోతున్నారన్న అంచనాల నేపథ్యంలో  ట్విటర్‌కు ప్రత్యమ్నాయంగా అమెరికాలో పాగా వేసేందుకు కూ పావులు కదుపుతోంది. త్వరలోనే అమెరికాలో సేవలను ప్రారంభించనున్నామని  కంపెనీ సహ వ్యవస్థాపకుడు  అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు.  నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం. యూఎస్‌లో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి తెలియజేయాలని కోరారు. 

స్వదేశీ యాప్ 50 మిలియన్ల డౌన్‌లోడ్లతో  ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే రెండవ మైక్రోబ్లాగింగ్ యాప్‌గా అవతరించింది.  ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న కూ యాప్  దాదాపు 10కిపైగా భాషల్లో అందుబాటులో ఉంది. ఇపుడిక కూ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి. మరోవైపు ట్విటర్‌ లాగా తాము ఎలాంటి  వెరిఫికేషన్  ఎలాంటి ఫీజు వసూలు చేయమని ఇటీవల ప్రకటించడం గమనార్హం. (మస్క్‌ 13 కిలోల వెయిట్‌ లాస్‌ జర్నీ: ఫాస్టింగ్‌ యాప్‌పై ప్రశంసలు)

కాగా మస్క్‌ నెలకు 8 డాలర్ల బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు నవంబరు 29 నుంచి ప్రారంభించనున్నారు. దీనికితోడు ట్విటర్‌ను మస్క్‌ టేకోవర్‌ చేసిన తరువాత, మార్పులు, చేర్పులు  సంచలన నిర్ణయాలతో  వివాదాస్పదంగా మారుతున్నారు. దీనికి తోడు చాలా దిగ్గజ సంస్థలు తమ యాడ్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:  ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌: ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ డేస్‌ సేల్‌ అదిరే ఆఫర్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top