పంతం నెగ్గించుకున్న ఎలాన్‌ మస్క్‌ | India Working On New Policy To EV Import Taxes - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు శుభవార్త, కొత్త ఈవీ వెహికల్‌ పాలసీపై కేంద్రం కసరత్తు.. అందుబాటు ధరలోనే

Published Fri, Aug 25 2023 3:57 PM

India Working On New Policy To Ev Import Taxes - Sakshi

కేంద్రం కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పాలసీపై పనిచేయనుందా? భారత్‌ ‘మేడిన్‌ ఇన్‌ ఇండియా’ నినాదంతో  దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా దిగుమతి పన్ను (import taxes) తగ్గిస్తూ కొత్త ఈవీ పాలసీని అమలు చేయనుందా? అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ వెహికల్‌ పాలసీ ఉండబోతుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 

కేంద్రం కసరత్తు చేస్తున్న కొత్త వెహికల్‌ పాలసీ ఇలా ఉండబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  ప్రస్తుతం.. దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్‌ వాహనాలపై 100 శాతం ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ అమలుతో 15 శాతం పన్ను రాయితీని పొందవచ్చు. అదే కారు ధర 40,000 డాలర్లు కంటే ఎక్కువగా ఉంటే 70 శాతం ట్యాక్స్‌ కట్టేలా కేంద్రం కొత్త వెహికల్‌ పాలసీని తయారు చేస్తుందని పలు నివేదికలతో పాటు, వెహికల్‌ పాలసీతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారులు చెప్పారంటూ  నివేదికలు పేర్కొన్నాయి. 



అమెరికా తరహాలో 
ఉదాహరణకు ..టెస్లా సంస్థ తయారు చేసి, అత్యధికంగా అమ్ముడైన కార్లలో ‘టెస్లా మోడల్‌ వై’ ఒకటి. ట్యాక్స్‌ తగ్గక ముందు ఈ కారు ప్రారంభ ధర 47,740 డాలర్లుగా ఉంది. పన్ను రాయితీ పొందిన తర్వాత అదే కారు ధర 47,490 డాలర్లకు అమ్ముతుంది. అలా, అమెరికా ప్రభుత్వం టెస్లా కార్లపై ఎలాంటి రాయితీలు ఇస్తుందో.. అదే తరహాలో భారత్‌ సైతం తమకు ట్యాక్స్‌ క్రెడిట్‌ ఇవ్వాలని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌  కోరుతున్నారు. దీంతో కేంద్రం సైతం సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకొని వెహికల్‌ పాలసీని తీర్చిదిద్దే పనిలో పడింది. 

కొత్త వెహికల్‌ పాలసీతో లాభాలు
ఒకవేళ ఇదే వెహికల్‌ పాలసీ అమల్లోకి వస్తే.. భారత్‌లోని పలు కార్ల తయారీ సంస్థలు ఇతర దేశాల్లో తయారైన ఈవీ కార్లను దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుంది. స్థానిక ఈవీ వాహనాల ధరల తగ్గుతాయని అంచనా. టెస్లాలాంటి అంతర్జాతీయ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ సంస్థలు స్థానికంగా కార్ల తయారీ, అమ్మకాలు నిర్వహించుకునే వెసలుబాటు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ కార్‌ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో 2 శాతం కంటే తక్కువగా ఈవీ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో వాటి విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

పన్ను తగ్గుతుందా?
దిగుమతి పన్ను తక్కువగా ఉంటే కొత్త కార్లతో పాటు ఇతర అన్నీ మోడల్‌ కార్లను అమ్మేందుకు  టెస్లాకు అవకాశం లభిస్తుందని మరో నివేదిక హైలెట్‌ చేసింది. కాగా.. కొత్త ఈవీ వెహికల్‌ పాలసీపై వాణిజ్య అర్ధిక ఆర్థిక మంత్రిత్వ శాఖలు, టెస్లా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే, ఈ వెహికల్‌ పాలసీ తయారీ ప్రారంభ దశలో ఉందని.. పూర్తియితే ట్యాక్స్‌ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

చదవండి👉 చంద్రయాన్‌-3 విజయం, భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు?

Advertisement

తప్పక చదవండి

Advertisement