భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్‌? | India-US Trade Talks Nirmala Sitharaman Says No More to Give | Sakshi
Sakshi News home page

భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్‌?

Oct 5 2026 1:48 PM | Updated on Oct 5 2026 1:48 PM

India-US Trade Talks Nirmala Sitharaman Says No More to Give

భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని రాయితీలు ఇవ్వడం లేదా తీసుకోవడం కష్టంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇరుపక్షాలు ఈ చర్చల్లో కీలక స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

అక్టోబర్‌ 3–5 మధ్య న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన సీతారామన్‌.. భారత్‌–అమెరికా ఒప్పందం అత్యంత కఠినంగా, విస్తృతంగా చర్చించిన ఒప్పందమని పేర్కొన్నారు. ఇంకా ఇరువైపులా చర్చలకు అవకాశం ఉంటే ముందుకు సాగుతామని తెలిపారు. గతంలో టారిఫ్‌లు వాణిజ్య చర్చల్లో ఒక సాధనంగా ఉండేవని, ఇప్పుడు అవి ఆయుధంలా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. వాణిజ్య అసమతుల్యతలను సుంకాల ద్వారా ఒత్తిడికి గురిచేయడం కంటే మార్కెట్‌ అవకాశాలు, పరస్పర రాయితీలపై చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు.

భారత్‌కు అనుకూలంగానే..

అమెరికాతో వాణిజ్య సమతుల్యత భారత్‌కు అనుకూలంగా ఉందని, దీంతో అమెరికా తన లోటును తగ్గించుకోవాలని చూస్తోందని మంత్రి వివరించారు. ఇదే సమయంలో చైనాతో భారత్‌కు ఉన్న భారీ వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ఇలాంటి అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా పర్యటనలో మధ్యంతర ఒప్పందం దిశగా చర్చలు జరిపారు. భారత్‌ సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందానికి కట్టుబడి ఉందని అధికారికంగా తెలిపింది.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సెప్టెంబర్‌ 30న ఫోన్‌లో మాట్లాడి వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సన్నిహితంగా కొనసాగాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: పసిడి ధరలపై ఓ లుక్కేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement