ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి.. లోన్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తాయని, హోమ్ లోన్ తీసుకుంటే వచ్చే సమస్యలు.. ఎలా ఉంటాయో ఒక టెకీ తన అబుభవాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రూ.53 లక్షల లోన్ తీర్చడానికి తనకు ఆరు సంవత్సరాల కాలం పట్టిందని రెడ్దిట్ పోస్టులో వెల్లడించారు. అంతే కాకుండా నెలవారీ ఈఎంఐ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ఒత్తిడిని కలిగిస్తుందో కూడా పేర్కొన్నాడు.
2019లో రూ. 53 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాను. 2025 నవంబర్ చివరి నాటికి లోన్ క్లియర్ చేసాను. అంటే ఈ లోన్ చెల్లించడానికి 6 సంవత్సరాల సమయం పట్టింది. ఎవరూ హోమ్ లోన్ తీసుకోవద్దని.. ఈ సందర్భంగా ఆ టెకీ సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతిగా ఆలోచించేవారు.. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

రూ.14 లక్షలు వడ్డీతో..
జర్మనీలోని ఒక ఆటోమోటివ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కారణంగా.. లోన్ తొందరగా క్లియర్ చేయగలిగాను. నేను తీసుకున్న రూ. 53 లక్షల లోనుకు.. రూ.14 లక్షలు వడ్డీతో కలిపి.. మొత్తం రూ.67 లక్షలు చెల్లించాను. విదేశాల్లో ఉద్యోగం చేయడం.. లోన్ చెల్లించడంలో చాలా సహాయపడింది.
ఇల్లు కొనడం మొదట్లో భావోద్వేగంగా ఉంటుంది, కానీ నిర్వహణ సమస్యలు ఎక్కువైనప్పుడు.. భావోద్వేగం భారమవుతోంది. 'ఇంటిని సొంతం చేసుకోవడం అంటే.. దాని సమస్యలను కూడా సొంతం చేసుకోవడమే' అని ఆ టెకీ పేర్కొన్నాడు. నేను లోన్ తీసుకుని కొనుగోలు చేసిన ఇల్లు విలువ.. ఇప్పుడు కోటి రూపాయలు. కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు ఖాళీ అని పేర్కొన్నాడు.
హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటే.. ఇది వ్యక్తులను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మరింత డబ్బు ఆదా చేసేలా ప్రేరేపిస్తుందని ఆ టెకీ పేర్కొన్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: 39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!


