
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్‌లో మూడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్‌ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్‌ను బట్టి స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్‌ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.
శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్లను ప్రారంభించింది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
12జీబీ+256జీబీ ధర రూ.1,74,999
12జీబీ+512జీబీ ధర రూ.1,86,999
16జీబీ+1టీబీ ధర రూ.2,10,999
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.
12జీబీ+256జీబీ ధర రూ.1,09,999
12జీబీ+512జీబీ ధర రూ.1,21,999
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.
8జీబీ+128జీబీ: రూ.89,999
8జీబీ+256జీబీ: రూ.95,999
ఈ స్మార్ట్ ఫోన్లు భారత్లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది.