‘మే’లో తయారీ మందగమనం | India manufacturing PMI eased to three-month low in May 2025 | Sakshi
Sakshi News home page

‘మే’లో తయారీ మందగమనం

Jun 3 2025 6:03 AM | Updated on Jun 3 2025 6:03 AM

India manufacturing PMI eased to three-month low in May 2025

మూడు నెలల కనిష్టానికి వృద్ధి 

న్యూఢిల్లీ: దేశీ తయారీ రంగ వృద్ధి గత నెలలో మందగించింది. మూడు నెలల కనిష్టానికి చేరింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) మే నెలలో 57.6కు చేరింది. అంతకుముందు నెల ఏప్రిల్‌లో 58.2గా నమోదైంది. 

ఇందుకు ప్రధానంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డిమాండ్‌ నీరసించడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపాయి. పీఎంఐ 50కుపైగా నమోదైతే తయారీ రంగం వృద్ధిలో కొనసాగుతున్నట్లే. 50 దిగువకు చేరితే ప్రతికూల వృద్ధికి చేరినట్లు. అయితే మే నెలలో తయారీ రంగ వృద్ధి రేటు గత మూడు నెలల్లోనే కనిష్టంగా నమోదైనట్లు సర్వే పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement