గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ టాప్‌-10లో భారత్‌

India Jumps 37 Places To Rank 10 in Global Cyber Security Index - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌-200 టాప్‌-10 దేశాల్లో భారత్‌ నిలిచింది. ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ రూపొందించిన ఈ జాబితాలో భారత్‌ 10వ ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. 37 స్థానాలు మెరుగుపడి ఈ ర్యాంక్‌ను దక్కించుకోవడం విశేషం. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్‌ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంత పరంగా నాల్గవ ర్యాంక్‌ సాధించింది. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో చట్టపరమైన, సాంకేతిక, సంస్థాగత చర్యలు, సామర్థ్యం అభివృద్ధి, సహకారం ఆధారంగా ఇండెక్స్‌ రూపుదిద్దుకుంటుంది. 

ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్ పరంగా భారత్ టాప్ 10లో ఉంటే మన శత్రు దేశాలు చైనా 33వ స్థానంలో, పాకిస్తాన్ 79వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌(ఐటీయు), గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా(జీసీఏ) జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో యుకె ఉంది. "ఇది గొప్ప వార్త సీఈఆర్​టీ(సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్)తో పాటు మేము తీసుకున్న చర్యలకు ఇది నిదర్శనం' అని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్(ఎన్ సీఎస్సీ) రాజేష్ పంత్ అన్నారు.

చదవండి: సెప్టెంబర్‌ నుంచి బజాజ్‌ ఎలక్ట్రిక్ చేతక్‌ డెలివరీలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top