
పుంజుకున్న ఉద్యోగ నియామకాలు
మే నెలలో 8.9 శాతం అప్
ఎనిమిది నెలల క్షీణతకు బ్రేక్
ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్‌లు) జాబ్‌సైట్ ఇండీడ్ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది.
భారత్‌లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్‌లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది.
ఈ విభాగాల్లో అధిక నియామకాలు..
చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 3.6 శాతం, సైంటిఫిక్ రీసెర్చ్‌లో 3.1 శాతం మేర జెనరేటివ్ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి.