ఐఐపీ డేటా షాక్‌: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

India IIP Data October 2022 contracts 4pc - Sakshi

అక్టోబర్‌ నెలకు మైనస్‌ 4 శాతం 

న్యూఢిల్లీ: ఒకవైపు ద్రవ్యోల్బణం శాంతించగా, మరోవైపు పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గి పోయింది. మైనస్‌ 4 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ప్రధానంగా తయారీ తగ్గడం, మైనింగ్, విద్యుత్‌ విభాగాల్లో వృద్ధి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ వివరాలను ఎన్‌ఎస్‌వో విడుదల చేసింది. మైనింగ్‌ విభాగం కేవలం 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ విభాగం మైనస్‌ 5.6 శాతానికి పడిపోయింది. (దగ్గు నివారణకు హెర‍్బల్‌ సిరప్‌: వాసా తులసి ప్లస్‌)

విద్యుత్‌ ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 2.3 శాతం, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం 15 శాతం మేర, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌లో 13.4 శాతం క్షీణత నమోదైంది. ఇంటర్‌ మీడియట్‌ గూడ్స్‌ ఉత్పత్తి 2.8 శాతం తగ్గగా, ప్రైమరీ గూడ్స్‌ 2 శాతం, ఇన్‌ఫ్రా/కన్‌స్ట్రక్షన్‌ గూడ్స్‌ ఉత్పత్తి 1 శాతం వృద్ధిని చూశాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని చూడగా, 2021 అక్టోబర్‌ నెలలోనూ 4.2 శాతం వృద్ధి నమోదు కావడాన్ని గమనించొచ్చు.

మొత్తం మీద అక్టోబర్‌లో ఐఐపీ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా రావడం గమనార్హం. 2020 ఆగస్ట్‌ నెలకు నమోదైన మైనస్‌ 7 తర్వాత, మళ్లీ ఇంత కనిష్టాలకు తయారీ రంగం పనితీరు పడి పోవడం ఇదే మొదటిసారి. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్‌ వెరిఫైడ్‌ మార్క్‌ షురూ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top