ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్‌ వెరిఫైడ్‌ మార్క్‌ షురూ

Twitter accounts are now verified with three colours check details - Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా మైక్రోబ్లాగింగ్ ఫాట్‌పారం ట్విటర్‌ అకౌంట్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న వెరిఫికేషన్‌ మార్క్‌ బ్లూ టిక్ ..ఇపుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి వెబ్‌ యూజర్లు నెలకు 8 డాలర్లు  చెల్లించాల్సి ఉటుంది.  ఐఫోన్‌ యూజర్లు మాత్రం 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

బ్లూ చెక్‌మార్క్‌తో పాటు, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ట్విటర్‌ బ్లూ సేవలను కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. బ్లూ సేవలను ప్రత్యేక రుసుం చెల్లించిన ఎవరికైనా ఇవ్వనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన  ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ  మంగళవారం (డిసెంబరు13)న  షురూ అయింది.  

ట్విటర్‌  టేకోవర్‌  తరువాత బిలియనీర్‌  ఎలాన్ మస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో  ఒకటి వెరిఫికేషన్‌ ఫీజు. అలాగే ఆయా వర్గాల వారీగా టిక్‌  కలర్‌ మార్పు.  ఇప్పటికే  ఒకే వెరిఫికేషన్ టిక్ (బ్లూ) ఉన్న సంగతి తెలిసిందే.  తాజా మార్పుల ప్రకారం ఇపుడిక  సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ కలర్‌ టిక్‌ను కేటాయించ నున్నట్టు మస్క్‌ ప్రకటించారు. 

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top