ట్విటర్‌ యూజర్లకు శుభవార్త!

Twitter Has Restored The Verification Badge Of All Twitter Users Who Have Over 1 Million Followers - Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లకు తొలగించిన ‘బ్లూటిక్‌’ వెరిఫికేషన్‌ మార్క్‌లను మళ్లీ పునరుద్దరించారు. 

ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌కు ఛార్జీలు తీసుకొచ్చిన మస్క్‌..నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించకపోతే వెరిఫికేషన్‌ మార్క్‌ తొలగిస్తామని చెప్పారు. అనుకున్నదే తడువుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్‌ ఖాతాల వెరిఫికేషన్‌ మార్క్‌ను తొలగించారు. ఫలితంగా ప్రజాప్రతినిధుల నుంచి సినీ ప్రముఖులు వరకు ట్విటర్‌ బ్లూ మార్క్‌ను కోల్పోయారు. 

అయితే ఈ నేపథ్యంలో బ్లూ మార్క్‌ను తొలగించిన అకౌంట‍్లకు మళ్లీ పునరుద్దరించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని అకౌంట్లు సైతం ఉన్నాయి. బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఉన్న అకౌంట్లకు వన్‌ మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న ఖాతాలను మస్క్‌ రీస్టోర్‌ చేశారు.    

ఇదే ఫైనల్‌
ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు వీలుగా ట్విటర్‌ సంస్థ తొలిసారిగా 2009లో బ్లూ టిక్  ఖాతాలను ప్రవేశపెట్టింది. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కానీ 2022లో ట్విటర్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన మస్క్‌.. ట్విటర్ బ్లూ టిక్ అకౌంట్లకు ఛార్జీలు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలపై ఈ ఏడాది ఏప్రిల్‌ 11న మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని అకౌంట్లకు ఏప్రిల్‌ 20 నుంచి వెరిఫికేషన్‌ బ్యాడ్జీలను తొలగిస్తామని పేర్కొన్నారు.  

‘బ్లూటిక్‌’ వెరిఫికేషన్‌ మార్క్‌ల పునరుద్దరణ


ట్వీట్‌లో మస్క్‌ చెప్పినట్లుగానే వెరిఫికేషన్‌ బ్యాడ్జీలను డిలీట్‌ చేశారు. దీంతో సెలబ్రిటీ  ట్విటర్‌ యూజర్లు మస్క్‌పై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్‌బిలాంటి వారు సైతం తాము ట్విటర్‌ బ్లూ కోసం డబ్బులు చెల్లించినా..బ్యాడ్జీని ఎందుకు తొలగించారంటూ మస్క్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా అధికారిక అకౌంట్లకు బ్లూ చెక్‌ మార్క్‌లు ప్రత్యక్షమయ్యాయి.

చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్‌ కష్టాలకు చెక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top