గార్మెంట్స్‌ ఎగుమతులు జూమ్‌ | India garment exports have shown a positive trend despite global uncertainties | Sakshi
Sakshi News home page

గార్మెంట్స్‌ ఎగుమతులు జూమ్‌

Dec 19 2024 12:32 PM | Updated on Dec 19 2024 12:32 PM

India garment exports have shown a positive trend despite global uncertainties

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో భారత్‌ నుంచి రెడీమేడ్‌ గార్మెంట్స్‌ ఎగుమతులు 11.4 శాతం పెరిగి 9.85 బిలియన్‌ డాలర్లకు(రూ.81,516 కోట్లు) చేరుకున్నాయి. మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌ను ఈ వృద్ధి తెలియజేస్తోందని అపారెల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) తెలిపింది. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలతో సమీప భవిష్యత్తులో అధిక వ్యాపార అవకాశాలున్న భారత్‌ వైపునకు మళ్లనున్నాయని కౌన్సిల్‌ వివరించింది.

దేశ స్వాభావిక బలాలు, కేంద్ర, రాష్ట్రాల పటిష్ట సహాయక విధానాలతో  ప్రయోజనాలను పొందేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఏఈపీసీ ఛైర్మన్‌ సుదీర్‌ సెఖ్రి అన్నారు. ఎండ్‌–టు–ఎండ్‌ వాల్యూ చైన్‌ సామర్థ్యం, బలమైన ముడిసరుకు, స్థిర, బాధ్యతాయుత వ్యాపార పద్ధతులపై దృష్టి సారించే కర్మాగారాలతో భారత్‌ రాబోయే కాలంలో గణనీయ వృద్ధిని సాధిస్తుందని అన్నారు.

ఇదీ  చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలు

నమ్మకం పెరుగుతోంది..

మేడ్‌–ఇన్‌–ఇండియా ఉత్పత్తులపై గ్లోబల్‌ బ్రాండ్‌లకు పెరుగుతున్న నమ్మకాన్ని కూడా ఈ వృద్ధి ప్రతిబింబిస్తోందని సుదీర్‌ తెలిపారు. ప్రత్యేకించి పండుగ సీజన్‌లో డిమాండ్‌ దూసుకెళ్లడం ఇందుకు ఉదాహరణ అని వివరించారు. అంతర్జాతీయ కొనుగోలుదారులు భారత్‌ టెక్స్‌ ఎక్స్‌పో–2025లో పాల్గొనాల్సిందిగా చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. భారత మొత్తం వస్త్ర వ్యవస్థను ఒకే గొడుకు కింద చూపే పెద్ద వేదిక అని వ్యాఖ్యానించారు. ‘భారత్‌ టెక్స్‌ రోడ్‌షో సందర్భంగా వివిధ దేశాలకు వెళ్లాం. అంతర్జాతీయ కొనుగోలుదారులు, రిటైల్‌ చైన్‌ల నుంచి అద్భుత ప్రతిస్పందనలను అందుకున్నాం. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రోత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్లాట్‌ఫామ్‌ గొప్ప సహకారాన్ని, సోర్సింగ్‌ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుందని భావిస్తున్నాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement