ఫైనాన్షియల్‌ రంగం, ప్రైవేట్‌ పెట్టుబడుల దన్ను! | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్‌ రంగం, ప్రైవేట్‌ పెట్టుబడుల దన్ను!

Published Tue, Oct 17 2023 6:21 AM

India Expected To Grow At 6. 3percent In FY24: Ficci Survey - Sakshi

న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్‌ రంగం, ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో  ఏప్రిల్‌తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌
సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు.  
► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్‌ నినో ప్రభావం దీనికి కారణం.  
► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు.
► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది.  
► 2023 సెపె్టంబర్‌లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.  
► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు
తగ్గవచ్చు.  
► రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.  ప్లస్‌ 2, మైనస్‌ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో  6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ పాలసీ
అంచనావేస్తోంది.  
► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్‌ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్‌ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు.  

2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత
2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది.  వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్‌బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన  సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్‌బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్‌బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. 

Advertisement
 
Advertisement