కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌  | India core infrastructure sector posted zero growth in October 2025 | Sakshi
Sakshi News home page

కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌ 

Nov 21 2025 4:12 AM | Updated on Nov 21 2025 4:12 AM

India core infrastructure sector posted zero growth in October 2025

బొగ్గు, విద్యుదుత్పత్తి క్షీణత 

ఎరువులు, స్టీల్, రిఫైనరీ మెరుగు 

న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్‌లో ఫ్లాట్‌గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్‌లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.  

→ అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది.  
→ విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. 
→ ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది.  
→ పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  
→ ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్‌ ఉత్పత్తి 6.7%, సిమెంట్‌ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది.  
→ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. 

వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్‌ కార్యకలాపాలపై, విద్యుత్‌ డిమాండ్‌పై అక్టోబర్‌లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్‌ పనితీరు నేపథ్యంలో అక్టోబర్‌ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement