
హైదరాబాద్‌లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకే కాదు రిటైల్ స్పేస్‌కు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలోనే అత్యధిక రిటైల్ స్పేస్ లీజులు మన దగ్గరే ఎక్కువగా జరిగాయి. 2025 క్యూ2లో 8 లక్షల చ.అ. స్థల లావాదేవీలు పూర్తయ్యాయని, దీంతో కలిపి ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో 15 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజులు జరిగాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2027 నాటికి నగరంలోకి 28 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ సరఫరా అవుతుందని, ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలంలో సుమారు 17 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ వినియోగంలోకి కూడా వస్తుందని అంచనా వేసింది. – సాక్షి, సిటీబ్యూరో
ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యాషన్..
ఫుడ్ అండ్ బేవరేజెస్(ఎఫ్‌అండ్‌బీ) బ్రాండ్లు ఎక్కువగా రిటైల్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగం వాటా 34 శాతంగా ఉండగా.. ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. ఈ క్యూ2లో కొత్తగా గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా జరగకపోవడంతో మాల్స్‌లో వేకన్సీ రేట్ 1.85 శాతంగా ఉంది. ఇక, హై స్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దెలకు ఆదరణ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూబ్లీహిల్స్ వంటి హై స్ట్రీట్‌లో అద్దెలు 13.6 శాతం మేర పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లోనూ రిటైల్ అద్దెలు ఆశాజనకంగానే వృద్ధి చెందుతున్నాయి.
హాట్‌స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లి
ఈ ఏడాది రెండో త్రైమాసికం(క్యూ2)లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 22.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు పూర్తయ్యాయి. గతేడాది క్యూ2లో జరిగిన 23.9 లక్షల చ.అ. జరిగాయి. ఈ ఏడాది క్యూ1లో 23.7 లక్షల చ.అ.లు జరిగాయి. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హైస్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 89 శాతం లీజులు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి. బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాలు రిటైల్ స్పేస్‌కు హాట్ స్పాట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్యూ2లో ఈ ప్రాంతాలలో 57 శాతం లీజులు జరిగాయి. అమీర్‌పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాలలో 43 శాతం రిటైల్ స్పేస్ లీజులు పూర్తయ్యాయి.
