
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ తాజాగా 2వ జీసీసీ లీడర్‌షిప్ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. జూలై 30న లీడర్‌షిప్ ఫెడరేషన్ నిర్వహించే ఈ కాంక్లేవ్‌లో దేశ విదేశ దిగ్గజాలు, ప్రభుత్వ సంస్థలు, ఇన్నోవేషన్ హబ్‌లకు చెందిన 300 మంది సీనియర్ లీడర్లు పాల్గోనున్నారు.
చౌకగా సర్వీసులను అందించే వ్యాపార విభాగాల స్థాయి నుంచి అంతర్జాతీయంగా కొత్త ఆవిష్కరణలకు చోదకాలుగా జీసీసీలు ఎదుగుతున్న తీరుపై ఇందులో చర్చిస్తారని లీడర్‌షిప్ ఫెడరేషన్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు రాబిన్ జె తెలిపారు. ఈసారి సదస్సులో జెన్‌ఏఐ–ఆటోమేషన్, వర్క్‌ఫోర్స్ పరివర్తన తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఉంటాయని పేర్కొన్నారు.