మన క్రెడిట్ స్కోరును వేగంగా ఎలా పెంచుకోవాలి..?

How To Improve My Credit Score Fast For Free in Telugu - Sakshi

మనం ఏదైనా బ్యాంకు నుంచి రుణాన్ని పొందాలంటే ముందుగా క్రెడిట్‌ స్కోర్‌/ సిబిల్ స్కోర్ ఏంత ఉందని కచ్చితంగా చూస్తారు. మన క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటేనే బ్యాంకులు మనకు రుణాలు ఇవ్వడానికి ముందుకువస్తాయి. మీ సిబిల్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. అందుకే మన సిబిల్ స్కోరు ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. మన క్రెడిట్‌స్కోర్‌/సిబిల్ స్కోరు గనుక 650 కంటే తక్కువ ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే మనం మన సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. అయితే, మన సిబిల్ స్కోరు గనుక తక్కువగా గనుక ఉంటే ఎలా పెంచుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..(చదవండి: బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండ‌ర్ బైక్)

  • క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరు మెరుగుపరుచుకోవచ్చు. సకాలంలో బకాయిలు చెల్లించడం వల్ల వడ్డీ పెరగకపోవడమే కాకుండా, దీర్ఘకాలంలో మన క్రెడిట్ స్కోరు మెరుగుపడే ఉంటుంది.
  • మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే తక్కువ ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఉంటుంది. మరోవైపు, మీ క్రెడిట్ కార్డు లిమిట్ కంటే ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ రుణాల కోసం ధరఖాస్తు చేసుకోకపోవడం కూడా మంచిదే.
  • క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు తెలివిగా ఆలోచించండి. రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు సహాయకారిగా ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం, ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేయడం మంచిది కాదు. 
  • 2012లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన అధ్యయనంలో సుమారు 20 శాతం మంది వినియోగదారులు వారి క్రెడిట్ నివేదికలో లోపం ఉన్నట్లు కనుగొన్నారు. మీ క్రెడిట్ కార్డులో రిపోర్టులో లోపం లేకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.
  • ఎటువంటి రుణం/క్రెడిట్ కార్డు తీసుకొని వ్యక్తి సిబిల్ స్కోరు సాధారణంగా తక్కువ ఉంటుంది. కాబట్టి వారికి రుణాలు త్వరగా పొందడం కష్టతరం అవుతుంది. అందువల్ల, మీ క్రెడిట్ చరిత్ర పెంచుకోవడం కొరకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటే మంచిది.
  • క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి, క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోరు మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకోసమే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే మంచిది.
  • మీ క్రెడిట్ స్కోరు మీ గత క్రెడిట్ చరిత్రకు ప్రతిబింబం. దాని ఆధారంగా, రుణదాత రుణ దరఖాస్తును ఆమోదిస్తారు. అందువల్ల, మీ పాత మంచి రుణ ఖాతా రికార్డులను మీ క్రెడిట్ రిపోర్ట్ లో ఉంచడం మీ క్రెడిట్ స్కోరుకు మంచి చేకూరుస్తుంది.
  • మీరు ఇతర వ్యక్తులకు పూచికత్తుగా ఉండటం వల్ల ఒక్కోసారి మీ క్రెడిట్ స్కోరు  దెబ్బతింటుంది. అందుకని, అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
  • ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం, ఎక్కువ రుణాల కోసం ధరఖాస్తు చేసుకోవద్దు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు కచ్చితంగా దెబ్బతింటుంది. కాబట్టి, ఒక రుణం తీసుకున్న తర్వాత మరొక రుణం తీసుకోవడం మంచిది.
  • క్రెడిట్ స్కోరు రాత్రికి రాత్రే మెరుగుపడదు. కాబట్టి, క్రెడిట్ రిపోర్ట్ పెరగడానికి కొంచెం ఓపిక అవసరం. అందుకని, మీరు సహనంగా ఉండాలి. 
     
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top