వాట్సాప్‌లో ఆధార్‌ డౌన్‌లోడ్‌.. ఈజీగా చేసుకోండిలా.. | How to download Aadhaar on WhatsApp Step by step process explained | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ఆధార్‌ డౌన్‌లోడ్‌.. ఈజీగా చేసుకోండిలా..

Sep 25 2025 12:32 PM | Updated on Sep 25 2025 1:49 PM

How to download Aadhaar on WhatsApp Step by step process explained

ఆధార్కార్డు (Aadhaar ) అన్నది దేశంలో అతి ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఆర్థిక వ్యవహారాలతో పాటు రోజువారీ కార్యకలాపాల్లోనూ ఆధార్కార్డు అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, సేవలను పొందటానికి ఇది చాలా కీలకం. ఇంతటి ముఖ్యమైన ఆధార్కార్డును భౌతికంగా వెంటపెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో అవసరం కూడా లేదు.

ఆధార్కార్డు యాక్సెస్ను సులభతరం చేయడానికి, ప్రజలు తమ ఆధార్ను నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా డౌన్లోడ్ చేసుకునే కొత్త ఫీచర్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్అధికారిక మైగవ్‌ (MyGov) హెల్ప్డెస్క్ చాట్బాట్ ద్వారా అందుబాటులో ఉంది. దీంతో వివిధ యాప్లు, వెబ్సైట్లకు వెళ్లే పని లేకుండా వేగంగా ఆధార్ను డౌన్లోడ్చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఇప్పటి వరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్తో వాట్సాప్లోనే ఆధార్డౌన్లోడ్సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. మైగవ్ హెల్ప్డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్లోడ్ ఇలా చేసుకోండి..

  • మీ ఫోన్ పై మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు (+91-9013151515)ని సేవ్ చేయండి.

  • వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్కు "హాయ్" లేదా "నమస్తే" వంటి గ్రీటింగ్ మెసేజ్పంపండి.

  • చాట్ బాట్ ద్వారా షేర్చేసిన ఎంపికల నుండి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి.

  • మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్ అందించండి.

  • వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.

  • వెరిఫికేషన్పూర్తియన తర్వాత, చాట్ బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.

  • ఆధార్ను ఎంచుకుంటే కార్డు పీడీఎఫ్ వెర్షన్ నేరుగా వాట్సాప్లో వస్తుంది.

నోట్: ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.

ఇదీ చదవండి: బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement