
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా గృహ బీమా పాలసీలను ప్రకటించింది. అగ్ని, వరదలు, భూకంపాలు సహా 20 రిస్కులకు కవరేజీ అందించేలా పాలసీలను ప్రకటించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.
ప్రీమియంలు కవరేజీని బట్టి వార్షికంగా రూ. 181 నుంచి (జీఎస్‌టీ కూడా కలిపి) ప్రారంభమవుతాయి. గృహ రుణాలకు సంబంధించి ఈ పాలసీలకు అన్ని బ్యాంకులు, రుణ సంస్థల్లో ఆమోదయోగ్యత ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌పే యాప్ ద్వారా యూజర్లు దీన్ని పొందవచ్చు.