ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ కొనుగోలుదారుల‌కు ఎస్‌బీఐ బంప‌రాఫ‌ర్‌, రూ.250కే ఈఎంఐ లోన్‌!!

Hero Electric And Sbi Bank Offering Loans For Low Cost Emi - Sakshi

ఎల‌క్ట్రిక్ కొనుగోలుదారుల‌కు ఎస్‌బీఐ-ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ త‌యారీ సంస్థ హీరో బంప‌రాఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. నిబంధ‌ల‌న‌కు అనుగుణంగా ఎంపికైన క‌స్ట‌మ‌ర్ల‌కు అతిత‌క్కువకే ఫైనాన్స్ సౌక‌ర్యాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపాయి.    
 
హీరో సంస్థ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ పై క‌స్ట‌మ‌ర్లకు ఫైనాన్స్ అందించేందుకు ఎస్ బీఐతో జ‌త‌క‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు ఎస్‌బీఐ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యోనో యాప్ ద్వారా చేసిన చెల్లింపులపై అదనంగా రూ.2వేల వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ తెలిపింది.  

అంతేకాదు అర్హులైన కొనుగోలుదారులు ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఎస్‌బీఐ ఈజీ రైడ్ ప‌థ‌కంలో భాగంగా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్పై 4 సంవత్సరాల పాటు రూ.251 కంటే తక్కువ ఈఎంఐ సౌక‌ర్యంతో రూ.10వేల లోన్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. ఎస్‌బీఐ ఆధ్వ‌ర్యంలో ఈఎంఐను మ‌రింత సుల‌భతరం చేయ‌డం ద్వారా దేశంలోని గ్రీన్ మొబిలిటీ విప్లవానికి నాంది ప‌లికిన‌ట్ల‌వుతుంద‌ని ఎస్‌బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బిజినెస్ యూనిట్ చీఫ్ జనరల్ మేనేజర్ దేవేంద్ర కుమార్ అన్నారు.
 
హీరోఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ..ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈనేప‌థ్యంలో కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఎస్‌బీఐతో భాగ‌స్వామి అవ్వ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నాం. ఈ భాగస్వామ్యం గ్రీన్ మొబిలిటీ విప్లవానికి ఆజ్యం పోసేందుకు ఉత్తమ వడ్డీ రేట్లు, ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తున్న‌ట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top