హార్లే డేవిడ్సన్‌ ఎక్స్‌440 బుకింగ్స్‌ షురూ 

Harley Davidson X440bookingstarts details inside - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హార్లే డేవిడ్సన్‌ ఎక్స్‌440 బైక్‌ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు హీరో మోటోకార్ప్‌ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్‌ నుంచి డెలివరీలు ఉంటాయి. హార్లే డేవిడ్సన్‌ షోరూంలు, ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్‌ ఔట్‌లెట్స్, ఆన్‌లైన్‌లో రూ.5,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

440 సీసీ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్స్‌ను నీమ్రానా ప్లాంటులో హీరో మోటోకార్ప్‌ తయారు చేస్తోంది. 440 సీసీ విభాగంలోకి ఇరు కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లలో ఎక్స్‌440 లభిస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం. 2020 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్‌ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో హార్లే డేవిడ్సన్‌ బ్రాండ్‌ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హీరో మోటోకార్ప్‌ అభివృద్ధి చేయడంతోపాటు విక్రయిస్తుంది. (తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు)


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top