జీఎస్‌టీ వసూళ్లు @ రూ.1.57 లక్షల కోట్లు | GST collections rise 11. 5percent to cross Rs1. 57 lakh crore in May | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వసూళ్లు @ రూ.1.57 లక్షల కోట్లు

Jun 2 2023 3:55 AM | Updated on Jun 2 2023 3:55 AM

GST collections rise 11. 5percent to cross Rs1. 57 lakh crore in May - Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా మూడో నెల మేలో కూడా  రూ. 1.50 లక్షల కోట్లు దాటాయి. సమీక్షా నెల్లో (2022 మే నెలతో పోల్చి) 12 శాతం వృద్ధితో రూ. 1.57 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదయినట్లు గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నట్లు ఈ ఫలితాలు పేర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చిలో వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో (2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఎన్నడూ లేనంతగా) రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఇక రూ.1.4 లక్షలకోట్ల పైన వసూళ్లు వరుసగా 14వ నెల. తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...

► మొత్తం వసూళ్లు రూ.1,57,090 కోట్లు.
► సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.28,411 కోట్లు.
► స్టేట్‌ జీఎస్‌టీ రూ.35,828 కోట్లు.  
► ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.81,363 కోట్లు.
► సెస్‌ రూ.11,489 కోట్లు.

Advertisement
 
Advertisement
Advertisement