ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసాకి భారత్‌లో కొత్త 2027 జెడ్1100 బైక్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12.79 లక్షలు. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఈ బైక్ ప్రీమియం నేకెడ్ బైక్ విభాగంలో అందుబాటులోకి వచ్చింది.
ఈ బైక్‌లో 1,099 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,000 ఆర్‌పీఎం వద్ద 136 బీహెచ్‌పీ పవర్, 7,600 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను పొందుతుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది.
సస్పెన్షన్ కోసం ముందు భాగంలో షోవా SFF-BP ఇన్వర్టెడ్ ఫోర్క్, వెనుకవైపు హారిజాంటల్ బ్యాక్‌లింక్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. బ్రేకింగ్ కోసం ముందు రెండు 277 మి.మీ. డిస్కులు, వెనుక 226 మి.మీ. డిస్క్ ఉన్నాయి. ఈ బైక్‌లో డన్‌లప్ స్పోర్ట్‌మ్యాక్స్ Q5A టైర్లను ఉపయోగించారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. 5 ఇంచెస్ TFT డిస్‌ప్లేతో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందించారు. రైడింగ్ సమయంలో భద్రతను మెరుగుపరిచేందుకు ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్, వివిధ రైడింగ్ మోడ్‌లను ఇచ్చారు. రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్!


