స్మార్ట్‌ టీవీ కొనుగోలు దారులకు గూగుల్‌ హెచ్చరిక.. అలాంటి టీవీలతో

Google Has An Important Message For Smart Tv Buyers - Sakshi

స్మార్ట్‌టీవీ కొనుగోలు దారులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం కీలక సమాచారం అందించింది. మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న ప్రతిటీవీ ఆండ్రాయిండ్‌ టీవీగా ప్రచారం జరుగుతుందని, అయితే, అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ పేరుతో టీవీలను విక్రయించినట్లు గూగుల్‌ గుర్తించింది. వాస్తవానికి అవి ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ స్టోర్స్‌ ప్రాజెక్ట్‌ను (aosp)ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.  

ఆండ్రాయిడ్‌ టీవీ వర్సెస్‌ ఏఓఎస్‌పీ 
గూగుల్‌ సమాచారం మేరకు..ఆండ్రాయిడ్‌ టీవీల్లో గూగుల్‌ యాప్స్‌ లైసెన్స్‌ లేకుండానే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్‌ టీవీ కొన్న ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌తో రూపొందించబడిన టీవీల్లో గూగుల్‌ యాప్స్‌ను ప్లే చేయలేం. అందుకే ఆయా సంస్థలు ప్లే ప్రొటక్ట్‌ సర్టిఫికెట్‌ విషయంలో జాగ్రత్త వహిస్తాయి.

టీవీ కొనేముందు తీసుకోవాల్సిన చూడాల్సిందిదే
కస్టమర్‌లు తాము కొనుగోలు చేస్తున్న టెలివిజన్‌  సురక్షితమా? కాదా? అని నిర్ధారించేందుకు ఆండ్రాయిటీవీ వెబ్‌సైట్‌ను విజిట్‌ చేయాలని గూగుల్‌ సిఫార్స్‌ చేస్తోంది. ఆ వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులు అధికారిక Android TV, Google TV, Android TV ఉత్పత్తులను చూడొచ్చు. ప్లేస్టోర్‌లోకి వెళ్లి గూగుల్‌ లైసెన్స్‌ పొందిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. టీవీకి ప్లే ప్రొటెక్ట్‌ సర్టిఫికేట్ లేకపోతే అది గూగుల్‌ ధృవీకరించలేదని అర్థం.

చదవండి👉 నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top