తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? | Gold Price Today: Gold Declines Rs 130, Silver Declines Rs 304 | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Dec 10 2021 9:03 PM | Updated on Dec 10 2021 9:14 PM

Gold Price Today: Gold Declines Rs 130, Silver Declines Rs 304 - Sakshi

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. కొద్ది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు కూడా తగ్గుముఖం పట్టింది. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా 10 గ్రాముల పసిడి ధర రూ.130 తగ్గుముఖం పట్టింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండియన్ బులియన్ & గోల్డ్ జ్యువెలరీ ప్రకారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర సుమారు రూ.130 తగ్గి రూ.47,836కు చేరుకుంది. 

అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల పసిడి ధర రూ.43,937 నుంచి రూ.43,818కు తగ్గింది. ఇక హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగి రూ.49,040కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.44,950కి చేరింది. ఇక వెండి ధర కూడా బంగారంతో పాటు తగ్గింది. నేడు రూ.300కి పైగా తగ్గి రూ.61,219 చేరుకుంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. ఫ్లైయింగ్‌ కార్లు వచ్చేస్తున్నాయ్‌!)

Advertisement
 
Advertisement
Advertisement