ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. ఫ్లైయింగ్‌ కార్లు వచ్చేస్తున్నాయ్‌!

Hyundai Flying Cars Will Be Ready to Take Off by 2030 - Sakshi

హ్యుందాయ్ మోటార్స్‌, ఉబర్ సంయుక్తంగా ఫ్లైయింగ్‌ కార్ల తయారీపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్‌ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్‌ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్‌ కార్లలో భాగంగా హ్యుందాయ్‌ ఎస్‌-ఏ1 ఎయిర్‌ టాక్సీలను సీఈఎస్‌-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్‌ చేసింది. కాగా, ఈ ఫ్లైయింగ్‌ కార్లు హైబ్రిడ్‌ ఇంజన్‌ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్‌ కార్ల రాకతో ట్రాఫిక్‌ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.

2028 నాటికి తన మొదటి వాణిజ్య విమానాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయలని లక్ష్యంగా చేసుకుంది. హ్యుందాయ్ యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ కోల్ ఈ దశాబ్దం చివరినాటికి ఎగిరే కార్లు వాస్తవ రూపం దాల్చుతాయి అని తాను నమ్ముతున్నానని గతంలో తెలియజేశారు. "ఇవి భవిష్యత్తులో మన జీవితంలో భాగం కానున్నట్లు మేము నమ్ముతున్నాము" అని అతను చెప్పారు. హ్యుందాయ్ ఇప్పటికే ఎస్-ఎ1 కాన్సెప్ట్ అభివృద్ధిపై పనిచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. అలాగే, 600 మీటర్ల వరకు వెళ్లగలదు. ఫ్లైయింగ్‌ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్‌ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్‌ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్‌ కంపెనీలు దృష్టిసారించాయి.

(చదవండి: భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top