భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!

India plans a Rs 76000 Cr Red Carpet For Semiconductor Companies - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాబోయే ఆరేళ్లలో 20 సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ & డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) యూనిట్లను ఏర్పాటు చేయడానికి రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. "వివిధ పీఎల్ఐ(ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక) పథకాల ద్వారా భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు" ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలపినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలపింది.

క్యాబినెట్ సమావేశం:
డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) తయారీ కోసం 2 యూనిట్లు, సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ కోసం 20 యూనిట్లు ఏర్పాటు చేయలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ పథకం ఆమోదం కోసం వచ్చే వారం క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ వీధి విధానాలను రూపొందించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అని అన్నారు. "దాదాపు అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి లక్ష్యాలను ప్రభావితం చేసే సెమీకండక్టర్ చిప్స్ కొరతతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. కార్లు నుంచి టీవీలు, ల్యాప్ టాప్స్, ఈయర్ బడ్స్, వాషింగ్ మెషిన్లు ఇలా ఒకటి అంటే ఇప్పుడు ప్రతి దానిలో సెమీకండక్టర్లను వినియోగిస్తున్నారు. కాబట్టి, ఈ ఎలక్ట్రానిక్ పాలసీ సరైన సమయంలో వస్తోంది" అని ప్రధాన పరిశోధన విశ్లేషకుడు కనిష్కా చౌహాన్ చెప్పారు. 

(చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!)

శామ్ సంగ్, ఎన్ఎక్స్ పి, క్వాల్ కామ్ వంటి చిప్ తయారీదారులతో పాటు తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టిఎంఎస్ సి) వంటి కంపెనీలను ఆకర్షించేలా ఈ పాలసీ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 40% మూలధన సబ్సిడీని ఇచ్చినప్పటికి కంపెనీలను ఆకర్షించడంలో విఫలం అయ్యింది. ముఖ్యంగా, చిప్స్ కొరత సమస్య వల్ల ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బ తింటున్న తరుణంలో కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

చైనాకు గట్టి ఎదురుదెబ్బ!
చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

(చదవండి: అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top