అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్‌

Micro Blogging Platform Coo MoU With Central Institute for Indian Languages Mysore - Sakshi

సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సవ్యమైన భాష, వ్యాఖ్యలను ప్రోత్సహించడానికి ధేశీయ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ కూ ఆధ్వర్యంలోని బాంబినేట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు  యాప్‌కు చెందిన కంటెంట్‌ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన పరిస్థితులను కల్పించడానికి  ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. ఆన్‌లైన్‌ బెదిరింపులు, అసంబద్ధ ఆరోపణల వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్‌ఫార్మ్‌ రూపొందించడానికి ఒప్పందం సహాయపడుతుందని ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top