
దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 పెరిగింది. అంతర్జాతీయంగా జౌన్స్ బంగారం 3400 డాలర్లు దాటింది.
ప్రస్తుత ధరలు
👉హైదరాబాద్‌లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,660 వద్ద ఉంది.
👉బెంగళూరులో రూ.99,860
👉విశాఖపట్నంలో రూ.99,770
👉చెన్నైలో రూ.99,740
👉ఢిల్లీలో రూ.99,555
ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు ఔన్స్‌కు 3,391-3,404 డాలర్ల వద్ద ఉన్నాయి.
కాగా ఈరోజు ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
