దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. | Gold and Silver Price 8th August 2024 | Sakshi
Sakshi News home page

దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Aug 8 2024 11:51 AM | Updated on Aug 8 2024 12:08 PM

Gold and Silver Price 8th August 2024

ఆగష్టు నెల ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 8) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69270 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ,ముంబైలలో స్థిరంగా ఉన్న బంగారం ధరలు చెన్నైలో మాత్రం పెరిగాయి. దీంతో చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 (22 క్యారెట్స్), రూ. 210 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63500 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 69270 వద్దకు చేరాయి.

దేశ రాజధాని నగరంలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయని స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. బుధవారం రూ. 500 తగ్గిన పసిడి.. గురువారం కూడా రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 86500లకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement