రూ.8,300 డౌన్‌! అమాంతం పడిన పసిడి, వెండి ధరలు! | Bullion Market Bloodbath, Why Are Gold And Silver Prices Witnessing A Massive Crash Across Global Markets? Read Full Story Inside | Sakshi
Sakshi News home page

రూ.8,300 డౌన్‌! అమాంతం పడిన పసిడి, వెండి ధరలు!

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 9:49 AM

Bullion Market Bloodbath Why Gold Silver Prices Tumbling Worldwide

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న ఊహించని పరిణామాలు, మదుపరుల లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) దాటికి విలువైన లోహాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొంతకాలంగా రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్లిన బంగారం, వెండి ధరల్లో నిన్న ఒక్కరోజే భారీ పతనం నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ తీరు మారింది.

వెండి 11 నెలల కనిష్టానికి!

ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ అందించిన అధికారిక గణాంకాల ప్రకారం.. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.8,300 క్షీణించి రూ.1,90,200 స్థాయికి పడిపోయింది. ఇది గడిచిన 11 నెలల కాలంలో నమోదైన అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గతంలో 2025 డిసెంబర్‌ 10న వెండి రూ.1.92 లక్షల వద్ద ట్రేడయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి.

రూ.1,300 తగ్గి 1.45 లక్షల వద్ద బంగారం..

వెండితోపాటు బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,300 మేర తగ్గి రూ. 1,45,200కు పరిమితమైంది. పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయినా ఇన్వెస్టర్లలో మాత్రం కలవరం మొదలైంది.

అంతర్జాతీయ మార్కెట్లో 4,000 డాలర్ల దిగువకు..

గ్లోబల్ మార్కెట్ల ప్రభావమే దేశీయంగా ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర కీలకమైన 4,000 డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 122.06 డాలర్లు (సుమారు 3.04 శాతం) నష్టపోయి 3,899.33 డాలర్ల వద్ద స్థిరపడింది.

మరోవైపు, గ్లోబల్ వెండి మార్కెట్ పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. అంతర్జాతీయంగా వెండి ఏకంగా 6 శాతం మేర క్షీణించి, కీలకమైన 50 డాలర్ల దిగువకు పడిపోయింది. 11 నెలల కనిష్టమైన 49.06 డాలర్లకు పడిపోవడం బులియన్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. చివరిసారిగా 2025 నవంబర్‌ 21న వెండి 50 డాలర్ల మార్కు వద్ద ట్రేడయ్యింది.

మార్కెట్ విశ్లేషకుల అంచనా

అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్ లేని ఇతర రంగాల వైపు తరలించడమే ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ ఒడుదొడుకులు ఇలాగే కొనసాగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో ఉదయం 10:30 వరకు కింది విధంగా రేట్లు ఉన్నాయి.

gold and silver price1
1/6

gold and silver price2
2/6

gold and silver price3
3/6

gold and silver price4
4/6

gold and silver price5
5/6

gold and silver price6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement