ఒరిజినల్‌ ఆధార్‌ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..

Get New PVC Aadhar Card Delivered At Home Complete Process Here - Sakshi

Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు.

పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్‌ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది.

ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్‌ చేయండిలా..

 • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
 • తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్‌ చేయండి
 • ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి.
 • తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్‌మిట్‌ చేయండి
 • అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి.
 • తర్వాత మీ ఆధార్‌ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
 • అనంతరం పేమెంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
 • క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. 
 • దీని తర్వాత పేమెంట్‌ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి.
 • చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది.
 • మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది.
 • పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్‌ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top