చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో - ఫోటోలు వైరల్

Gauahar Khan Buys New Mercedes Benz GLE Video Viral - Sakshi

ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్‌తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు.

గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్‌ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్‌‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..

బ్లాక్ షేడ్‌లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top