సీఈవోకే షాక్‌ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్‌!

Freshworks board cancels CEO Girish Matruboothams performance award of 6 million stock units - Sakshi

దేశీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్‌ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్‌డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్‌ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది.

“సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్‌ బేస్‌డ్‌ రిస్ట్రిక్టివ్‌ స్టాక్‌ యూనిట్స్‌ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్‌ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్‌కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు).

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top